
క్రైమ్ మిర్రర్, ఘనపురం, నల్గొండ:-
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా .. బాధ్యులు ఉదాసీనంగా ఉన్నా చర్య తప్పదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.మంగళవారం నాడు ఆయన గుడి పల్లి మండలం ఘనపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల లో తేమ, తాలు,ఇలా వడ్ల నాణ్యత ఎలా ఉన్నా..మిల్లు కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆక్షేపించారు.మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లో జాప్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు దరిమిలా.. పి ఏ పల్లి,గుడి పల్లి దారిలో ఉన్న చెన్న కేశవ రైస్ మిల్లు ను రఘునందన్ తనిఖీ చేశారు.ఈ రోజు వరకు ఎంత ధాన్యం స్వీకరించారు అన్న విషయం లో రికార్డుల ను పరిశీలించారు. మిల్లు కు వచ్చిన లారీలను త్వరిత గతిన దిగుమతి చేసుకోవాలని మిల్లర్ కు స్పష్టం చేశారు.
కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది మహిళలకు కుచ్చు టోపీ..