క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీ బాటన పట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా పార్టీలకు ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 2, 3వ తేదీలలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బిజెపి తరఫున ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. కాగా ఢిల్లీలో ఎక్కడైతే తెలుగు భాష ప్రజలు ఉంటారు ఆ చోటనే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీలో జరగబోయే ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదికాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలోని ప్రజలను ఏ విధంగా ఓటు హక్కుకు దగ్గరగా చేర్చుకునే విషయాలను మాట్లాడుతారో అని ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమితో కలిసి భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
1.అర్ధరాత్రి అక్రమ అరెస్టులా?! క్రైమ్ మిర్రర్ ప్రతినిధులు చేసిన తప్పేమిటి??
2.10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
380 ఏళ్ల చరిత్ర కలిగిన శంకరమఠం కూరగాయల మార్కెట్ ను జెసిబి లతో కూలగొట్టిన అధికారులు!..