
-
అమరావతి మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు సింగపూర్ సుముఖం
-
టువాస్ పోర్టును సందర్శించిన చంద్రబాబు
-
ఆసియాలోనే అతిపెద్ద టెర్మినల్ పోర్టుగా టువాస్
-
పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ పర్యటన
క్రైమ్ మిర్రర్, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో సింగపూర్ మాదిరి నగరం రూపకల్పను ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలు, సింగపూర్ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టువాస్ పోర్టును చంద్రబాబు బృందం సందర్శించింది. ఏసియాలోనే అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టును సింగపూర్ సర్కార్ నిర్మిస్తోంది.
టువాస్ పోర్టును సందర్శించిన అనంతరం పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రిజనల్ సీఈవో విన్సెంట్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి అతిపెద్ద తీరప్రాంతం పెద్ద అసెట్ అని, తీర ప్రాంతం ఆధారంగా పెట్టుబడులను ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఏపీలో పోర్టుల అభివృద్ది, పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్దికి సర్కార్ శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో పోర్టు కార్యకలాపాల నిర్వహణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై చర్చించారు.
Read Also: