
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా రెడీ అయ్యింది. తాజాగా ఇంటర్ ఫలితాల విడుదల తేదీలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈనెల 12 లేదా 13వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగగా, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ తాజాగా పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి తప్పులు లేకుండా మరోసారి అధికారులు పరీక్ష పేపర్లను తనిఖీలు చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. bieap.gov.in వెబ్సైట్ లో ఇంటర్ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.
కాగా పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి మానసికంగా లేదా అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు వెల్లడించారు. చాలామంది విద్యార్థులు పాస్ అవ్వనందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సందర్భాలు మనం చాలానే చూశాం. కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా అలాంటి పనులు చేయవద్దని విద్యాశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. పరీక్షల మార్కులు అనేవి కేవలం విద్యకు సంబంధించినవి మాత్రమే అని… జీవితానికి కాదని… కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.