![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-30.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. 2024 ఎన్నికలలో మేము కేవలం అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సంచలన వ్యాఖ్యలు అన్నారు. ప్రజల కోసం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్నో బటన్లను నొక్కి హామీలన్నీ కూడా నెరవేర్చినా కూడా ఎన్నికలలో మేము ఓడిపోవడం ఏంటని అన్నారు. రేపు అసలు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఇప్పటి కూటమి సర్కార్ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే ఆసక్తికరంగా ఉందని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఆలయాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం!..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నా నాయకులు ఎవరు కూడా గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. టిడిపి నాయకులు గ్రామాల్లోకి వెళితే గ్రామంలోని ప్రజలే గెంటేస్తారని అన్నారు. ఇక రాబోయేది జగన్ 2.0 పాలన అని, దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు వైసీపీ పార్టీని అధికారంలో ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో తప్పు చేసిన వారిని అసలు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కాగా గత ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు మాత్రమే గెలుపొంది ఘోరంగా ఓడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే. మరి రాబోయే ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం ఆయన మాటలు అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయ రంగంలోకి దిగారని, వైసిపి పార్టీకి పూర్వవైభోగాలు వచ్చేసాయని అంటున్నారు.
భారత ఆర్మీ ని అవమానించిన రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారి!..
‘ఎమ్మేల్సీ’ పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలి!… రాష్ట్రంలో మళ్లీ రాజకీయ గాలులు?