ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం!..

తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన గురించి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని అన్నారు. భగవంతుడివి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను.

మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

ఇవి కూడా చదవండి

1. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి: బీసీవై పార్టీ అధినేత

2.తిరుపతిలో తొక్కిసలాట.. భక్తురాలి మృతి

3.కాంగ్రెస్ నేతలను రోడ్లపై తిరగనీయం.. బండి సంజయ్ వార్నింగ్

4.హైకోర్టులో KTRకు ఊరట

5.తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి సెలవులు!… ఎన్ని రోజులు అంటే?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button