![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-28.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. అందులో భాగంగానే కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాదు నుంచి కేరళలోని కొచ్చిన్ కు బయలుదేరిన పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
భారత ఆర్మీ ని అవమానించిన రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారి!..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ పలుమార్లు దర్శించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలానే సనాతన ధర్మాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా కాపాడుకునే విధంగా చేయాలని పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రంలోని అన్ని ఆలయాలను సందర్శించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా తను పూర్తిగా అనారోగ్యం నుంచి కోల్కున్న తర్వాత ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని దేవాలయాల పర్యటనలు చేస్తున్నారు.
ఒక్కరోజే 10 కోట్ల మంది.. కుంభమేళా దారిలో 350 కిలోమీటర్ల ట్రాఫిక్
‘ఎమ్మేల్సీ’ పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలి!… రాష్ట్రంలో మళ్లీ రాజకీయ గాలులు?