
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై సెటైర్లు వేశారు. తాజాగా కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఒక్కసారిగా ఓ జి ఓ జి అంటూ సినిమా గురించి పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో… నేను మాట్లాడుతుంది ఏంటి?.. మీరు మాట్లాడేది ఏంటి?.. మీరు మారరు రా బాబు అంటూ చక్కటి చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఇక కర్నూలు జిల్లాలోని పూడిచెర్లలో రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి తాజాగా పవన్ కళ్యాణ్, శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత.. అలాగే చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని తెలిపారు.
కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ కార్యక్రమాలు పెట్టిన భారీగా అభిమానులు తరలి వెళ్తున్నారు. కార్యక్రమానికి వెళ్లడమే కాకుండా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కేకలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నోసార్లు సినిమాలు గురించి ప్రస్తావని తీసుకురాకండి అని పవన్ కళ్యాణ్ అభిమానులకు సందేశాలను కూడా ఇచ్చారు. అయితే తాజాగా జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల పై ఎలాంటి కోపం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో అలా అనకండి రా బాబు అంటూ సమాధానం ఇవ్వడంతో అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు.