
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళా ఉత్సవాలలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజినావాతో కలిసి మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. అలాగే త్రివేణి సంగమం వద్దకు బోటులో చేరుకొని గంగా మాతకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నడుమ మళ్లీ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ మహా కుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు తన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Read More : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!… మార్చి 28న సినిమా రిలీజ్?
కాగా 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. ఇప్పటికీ ఏకంగా 40 కోట్లకు ముందికి పైగా జనాలు ఈ మహా కుంభమేళాను వీక్షించి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా ఈ మహా కుంభమేళాకు సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ మహాకుంభమేళ ఉత్సవాలు ఈనెల 26వ తారీఖున శివరాత్రి పర్వదినాన ముగియనున్నాయి. కాగా ఇప్పటినుంచి కేవలం వారం మాత్రమే సమయం ఉంది.
ఇవి కూడా చదవండి