
జగిత్యాల జిల్లా బ్యూరో (క్రైమ్ మిర్రర్):- జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము జమున అనే యువతి కొడిమ్యాలలో వరకట్న దాహానికి బలైంది. గత ఏడాది క్రితం కొమ్ము జమున (అలియాస్ దుబ్బాక జమున) ను కోడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాహుల్ కు ఇచ్చి పెండ్లి చేశారు. పెండ్లి సమయంలో లాంఛనాల ప్రకారం సామాగ్రితో పాటు లక్షల్లో వరకట్నం కూడా ముట్ట చెప్పారు. అయినా అదనపు వరకట్నం పేరుతో తరచుగా జమునను పలు సార్లు వేధించారు. అంతే కాకుండా జమున భర్త రాహుల్ కు అక్రమ సంబంధాలు ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరకట్న హత్యకు గురైన జమున మృత దేహానికి బుధవారం జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. బుధ వారం సాయంత్రం బుగ్గారంలో జమున మృత దేహంతో అంతిమ యాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. జమున తల్లి కొమ్ము పోసవ్వ తల కొరివి పెట్టారు.
కోడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘు చందర్, మల్యాల సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ లు ప్రత్యక్షంగా హాజరై జమున హత్య కేసును శోధిస్తూ జమున హత్యకు గల బలమైన కారణాల కోసం పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. జమున భర్త రాహుల్ తో పాటు అత్త – మామలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
హ్యాండ్ రైటింగ్ లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి – ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్