
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రెబల్ స్టార్ ప్రభాస్ మరియు డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రాజాసాబ్ సినిమా రాగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ముందుకు సాగుతుంది. రాజాసాబ్ సినిమాపై ఇప్పటికే కొంతమంది అభిమానులు డైరెక్టర్ మారుతి పై ఆగ్రహం వ్యక్తం చేయగా మిగతా వారందరూ కూడా సినిమా బాగుంది అంటూ వారికి నచ్చినట్లు కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ మరోసారి డైరెక్టర్ మారుతి తో సినిమా తీసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే హోంబలే ఫిలింస్ తో డైరెక్టర్ మారుతి ఒప్పందం కూడా కూర్చుకున్నట్లుగా సినిమా వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ నిర్మాణ సంస్థతో మారుతికి కొంత అడ్వాన్స్ కూడా ఇప్పించారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక మారుతి మొత్తానికి స్క్రిప్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొంటారట. అయితే ఈ విషయంపై అధికారికంగా అయితే ఎటువంటి క్లారిటీ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగానే చర్చలు నడుస్తున్నాయి. కానీ మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం డైరెక్టర్ మారుతితో ప్రభాస్ సినిమా తీయొద్దు అంటూ లో లోపలే చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ స్థాయిని తగ్గించారు అంటూ.. ఈ సినిమా ప్రభాస్ కు సూట్ కాలేదు అంటూ… మారుతి ప్రభాస్ ను సారిగా ఉపయోగించుకోలేదు అంటూ చాలామంది దూషించిన విషయం తెలిసిందే.
Read also : ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!
Read also : Woman Suicide: భర్త కోతి అన్నాడని భార్య ఆత్మహత్య.. వామ్మో ఇదేం ఘోరం?





