- పాడ్ ట్యాక్సీలతో మరింత వేగంగా గమ్యస్థానాలకు
- మెట్రో స్టేషన్లకు కనెక్ట్ తో నడువనున్నాయి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. త్వరలోనే నగరంలో విదేశాల్లో మాదిరిగా పాడ్ టాక్సీ హైటెక్ రవాణ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, మెట్రోలు,ఆటోలు , ర్యాపిడో వంటి బైక్ ద్వరాల ప్రజలను తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నాయి.
ఈ పాడ్ టాక్సీ మెట్రో స్టేషన్లను అనుసంధానంతో నడుపనున్నారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) పేరిట ప్రభుత్వం ఈ ట్యాక్సీలు తీసుకురానుంది. మెట్రోరైలు స్టేషన్ల నుంచి ప్రయాణికులు తొందరగా తమ గమ్యస్థానం చేరేందుకు ఈ పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే చేపట్టాలనేది ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్‌వోటీ) విధానంలో సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కన్సల్టెంట్ ఎంపిక చేయనున్నారు. అందు కోసం హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్ జారీ చేసింది.ప్రస్తుతం నగరంలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు త్వరగా చేరుకునేందుకు మెట్రో బెస్ట్ ఆప్షన్ అయింది.
అయితే మెట్రో దిగిన తర్వాత తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇవి అన్ని చోట్ల అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు ట్రాఫిక్‌లో నరకం.
ఈ ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో స్టేషన్ల నుంచి రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేకుండా నేరుగా పాడ్‌ట్యాక్సీల ద్వారా గమ్యస్థానాలను చేరుకునేలా వినూత్న రవాణా వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. కాగా ఈ పాడ్స్ ముందుగా రాయదుర్గం-కూకట్ పల్లి నుంచి ప్రారంభం కానుంది.
