దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవ్వాల ఆంధ్రప్రదేశ్లోని కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో మోస్తారు వర్షాలు, అలాగే తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
ఇక రేపు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నివేదికలు జారీ చేసింది. ఆ తరువాత మళ్ళీ 19వ తారీఖున విశాఖపట్నం మరియు విజయవాడ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ తరువాత అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ రెండు రోజుల తరువాత తమిళనాడు తీరం దాటేటువంటి అవకాశం ఉందని ఐఎండి తాజాగా తెలిపింది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు దాదాపుగా రెండు నుంచి ఐదు రోజులు పాటుగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి.
మునిగిపోయే అమరావతికి ఎవరూ పోరు.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్
కాగా దాదాపుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో వర్షాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడుతున్న కారణంగా చాలామంది రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా చాలామంది పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం కూడా అయ్యాయి. ఈ రెండు రోజుల వర్షాలు తర్వాత నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎంతో కొంత అందజేయాలని రైతులు కోరుకుంటున్నారు.