
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయాలకు శుభవార్త తెలిపింది. తాజాగా రాష్ట్రంలో అంగన్వాడి కార్యకర్తలకు మరియు ఆయాలకు గ్రాడ్యుటి అమలు చేయాలన కూటమి సర్కార్ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వీళ్ళకి ఉత్తర్వులు ఇవ్వనుంది. అంగన్వాడీలకు మరియు ఆయాలకు గ్రాటివిటీ అమలు చేయడం ద్వారా ఏకంగా 55, 607 మంది అంగన్వాడి కేంద్రాల్లోని లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందని కూటమి ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు ఇస్తున్న లక్ష రూపాయలు మొత్తాన్ని కూడా సగటున లక్ష ,55 వేల రూపాయల వరకు పెరగనుందని తెలిపారు. ఇక వాళ్లు చేసే సర్వీసును బట్టి కొందరికి రెండు లక్షల నుంచి 2,50,000 వరకు అందనందని తెలిపారు. ఆయాలకు ఇచ్చే 40 వేల రూపాయల సగటును 75 వేల రూపాయలు వరకు చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రతిరోజు కూడా ఎంతోమంది చిన్న పిల్లలకు అన్నం తినిపించి చాలా చక్కగా చూసుకునే వారికి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం అనేది నిజంగా మంచి పనే అని చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి