క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. దాదాపుగా చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీపై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ బతుకుందని అన్నారు. రాష్ట్రంలో మరో 30 ఏళ్ల పాటు వైసిపి పార్టీ ఏలుతుందని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ ఒక్కరైనా పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని తెలిపారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారని, కానీ ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి సర్కార్ పై , నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం ఎలాగో తమ ప్రభుత్వాన్ని చెప్పమంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
1.స్మశాన వాటికలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం?..
2.టాప్ 10 శక్తివంతమైన దేశాలలో భారత్ కు నో ప్లేస్!…
3.కేకేకు కీలక పదవి.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!!