ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ కి వెళ్లిన సీఎం చంద్రబాబు.. రెండో రోజూ వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిరోజు పర్యటనలో పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఇప్పుడు రెండూ రోజూ ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల్లో పాల్గొననున్నారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సు, రౌండ్ టేబుల్ వంటి సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ సీఎం ఈరోజు భేటీ కానున్నారు.
మీటింగ్ లోనే ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడిన DRO.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం.. ఈ రోజు వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్నారు. బూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు.
13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో అడుగుపెడుతున్న కోహ్లీ!..
అంతకుముందు జ్యూరిచ్ తెలుగు కమ్యూనిటీ అధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా భాగమయ్యారు. ప్రపంచ వేదికపై తెలుగు సంస్కృతి వృద్ధి చెందడం చూసి తన హృదయం గర్వంతో నిండిపోతోందని, విశేషమైన కృషి, స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిని సాధిస్తూ తెలుగు వ్యక్తులు ప్రపంచ నాయకులుగా ఎదుగుతున్నారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన చంద్రబాబు బృందం.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. మాన్యుపాక్చరింగ్, ఆర్ అండ్ డి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు.. భవిష్యత్తులో రానున్న పోర్టులు, విమానాశ్రయాల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు కోరారు. ఏపీని వర్క్‌ఫ్రం హోం హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, కంపెనీలతో చర్చలు జరపాలని కోరారు.