
Annadata Sukhibhava: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ పథకం అమలుపై అధికారులకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 2 నుంచి ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు అందివ్వనుంది.
ఏడాదికి రైతుల ఖాతాలోకి రూ. 20 వేలు జమ
‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రైతుకు రూ. 14 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ డబ్బులను మూడు విడుతలుగా అందివ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000 జమ చేయనుంది. ఆగస్టు 2న ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు వెల్లడించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లాభం జరగనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!