
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ విశ్వంలో ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం లేదా వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అలాంటిది తాజాగా మరికొద్ది నిమిషాల్లోనే ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. అదేంటంటే ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం జరగనుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవాళ రాత్రి 6.49 గంటలకు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు అని సమాచారం. దీంతో ప్రతిరోజు కనిపించే చంద్రుడు సాధారణం కంటే 14% పెద్దగాను అలాగే 30% అధిక కాంతివంతంగా కనపడనున్నాడు. ఇలాంటి అద్భుతాన్ని సైంటిస్టులు బీవర్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. మన భారత దేశంలో ఈరోజు 6.49 గంటల సమయంలో పూర్ణచంద్రుడు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఎలాంటి పరికరాలు లేకుండానే ఈ దృశ్యాలను చాలా సులభంగా వీక్షించవచ్చు వచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు ఇలాంటి సూపర్ మూన్ అనేది ఏర్పడుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా 6.49 గంటల సమయంలో దాబా మీదకు వెళ్లి వీక్షించడానికి చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇటువంటి సూపర్ మూన్ ని చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి.
Read also : హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Read also : న్యూ గర్ల్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న ఆల్ రౌండర్ హార్దిక్..!





