ఏపీలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు.
పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం… భారీగా ఎగసిపడుతున్న మంటలు?
కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజ్ఞ మండిపడుతున్నారు.