చత్తీస్ఘడ్, క్రైమ్ మిర్రర్: ఆపరేషన్ ఖగార్ ముగిసిందనే లోపు మళ్లీ మావోయిస్టుల అలజడి. భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో మావోయిస్టులపై ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తుపాకుల శబ్దాలతో అటవి ప్రాంతమంతా దద్దరిల్లింది. మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మరో పదిమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
మాచపల్లి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై భద్రతాబలగాలు నిఘా ఉంచారు. ఈ క్రమంలో మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాల్పుల్లో పార్థాపూర్ ఏరియా మహిళా కమాండర్ ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. రూపి అలియాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగా గుర్తించారు.
తప్పించుకున్న మావోయిస్టులు…
ఎన్కౌంటర్ సమయంలో సుమారు 10 మావోయిస్టులు అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. వారు దట్టమైన అటవి ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పూర్తిగా గా చుట్టుముట్టి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు అడవిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మరి కొంతమంది మావోయిస్టులు అటవీలో దాగి ఉండవచ్చనే అనుమానంతో ఆపరేషన్ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.
