
Amit Shah Plan: రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం గురించి తన మనసులో మాట బయటపెట్టారు. ప్రకృతి వ్యవసాయంతో చాలా ప్రయోజనాలు ఉంటాయన్నారు అమిత్ షా. రసాయనిక ఎరువులతో పండే పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత, ఏం చేయాలి అనుకుంటున్నారో వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన సహకార్ సంవాద్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
ప్రకృతి వ్యవసాయంతో రోగాలు మాయం
రిటైర్ మెంట్ అనంతరం తన పని ప్రకృతి వ్యవసయం చేయడమే అన్నారు అమిత్ షా. “రిటైర్మెంట్ తరువాత నా సమయాన్ని వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడానికి కేటాయించాలని అనుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయం సైన్స్ ఆధారిత టెక్నిక్. చాలా ప్రయోజనాలు ఉంటాయి. కెమికల్ ఫెర్టిలైజర్స్ తో పెరిగే గోధుమలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీ, మధుమేహం, థెరాయిడ్, కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సోకుతాయి. ప్రకృతి సేద్యంతో రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండే అకాశం ఉంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయనాలు, ఎరువుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ప్రకృతి సేద్యం వల్ల పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తన వ్యవసాయక్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట దిగుబడి పెరిగింది. రైతులు కూడా ఇదే విధానాన్ని పాటిస్తే బాగుంటుంది” అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Read Also: శ్రీ రాముడు పుట్టింది ఎక్కడ? నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!