
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఎన్నికలలో టీడీపీ ఘనవిజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి గెలుపొందగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్లు కోల్పోయారు. టీడీపీ ఘన విజయం సాధించడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఎలక్షన్ లో ముందు నుండి అనుకుంటున్నట్లుగానే జగన్ గడ్డ పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేశారు. స్వాతంత్ర్యానికి ఒక రోజు ముందే పులివెందుల ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చామని టీడీపీ నాయకులు కాలర్ ఎగరేసి మరి చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులలో టీడీపీ పాగా వేయడంతో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరో వైపు వైసీపీ అభిమానులు అందరూ కూడా షాకే అవుతున్నారు. పులివెందుల ప్రజలు జగన్ పై ఎంత కసిగా ఉన్నారో ఈ విజయంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలోనూ వైసీపీకి డిపాజిట్లు దక్కలేదు.
Read also : స్వాతంత్ర దినోత్సవం నాడు టీడీపీ సంబరాలు.. పులివెందులలో టీడీపీ జెండా!
అయితే ఈ విషయంపై తాజాగా వైఎస్సార్సీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించడం జరిగింది. “ఈ జెడ్పిటిసి ఎన్నికల ఫలితాలు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు అంకితం అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దీన్ని చాలా మంది వైసీపీ కార్యకర్తలు సమర్థించగా.. టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు మాత్రం విజయాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి ఇంతే మాట్లాడతారు అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : స్వాతంత్ర దినోత్సవం నాడు టీడీపీ సంబరాలు.. పులివెందులలో టీడీపీ జెండా!