
Amarnath Yatra 2025: ప్రముఖ ఆధ్యాత్మిక అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అమర్ నాథ్ గుహల్లో కొలువైన మంచు రూప కైలాస నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బయల్దేరారు.5, 880 మందితో కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం యాత్రను మొదలు పెట్టింది. జమ్మూకాశ్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఇవాళ ప్రారంభం అయిన ఈ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.
అమర్ నాథ్ యాత్రకు భారీ బందోబస్తు
రీసెంట్ గా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల అలజడి నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూకాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా జమ్మూకాశ్మీర్ సర్కారు చర్యలు చేపట్టింది. అమర్ నాథ్ యాత్ర మార్గంలో నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించింది. జులై 1 నుంచి ఆగష్టు 10 వరకు ఈ ఆదేశాలు కొనసాగనున్నట్లు తెలిపింది. జమ్మూకాశ్మీర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు.. ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉండవని చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్ లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్ లోని బాల్తాల్ మార్గాల ద్వారా కాలినడకన, లేదంటే పోనీల సాయంతో మంచు లింగం దగ్గరికి చేరుకోవాలని సూచించింది.
Read Also: ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షాలు, హిమాచల్ అతలాకుతలం!