
క్రైమ్ మిర్రర్,మంగపేట :- బడి, గుడి.. ఏదైనా అభివృద్ధికి ఎల్లప్పుడూ తనవంతు సహకారం అందించడానికి ముందుంటానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి దాట్ల సుభద్రా దేవి,గోపాల నర్సరాజు (వాసు బాబు) అన్నారు. మండలంలోని అఖినేపల్లి మల్లారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో తరగతి గది నిర్మాణానికి తన వంతు సాయంగా రూ, 10,000 ఆర్ధిక సాయం అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.పాఠశాలలో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహా రావు, తోటి ఉపాధ్యాయులు దాట్ల గోపాల నర్సరాజు (వాసు బాబు) కి సమస్యను వివరించగా వెంటనే స్పందించి శుక్రవారం పాఠశాలకు వచ్చి విద్యార్థులు పడుతున్న ఇబ్బందిని స్వయంగా చూసి చలించి వెంటనే అదనపు తరగతి గది నిర్మాణానికి తన వంతు సాయం అందించి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రుల మన్ననలు పొందారు.ఈ సందర్బంగా దాట్ల గోపాల నర్సరాజు (వాసు బాబు) మాట్లాడుతూ అఖినేపల్లి మల్లారం తన స్వంత గ్రామం కాకపోయినా టీ,కొత్తగూడెం,అఖినేపల్లి మల్లారం రెండు గ్రామాలు నాకు రెండు కళ్ళ లాంటివని గ్రామాలు వేరైనా జంట గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లితండ్రుల,జంట గ్రామాల పేరు నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టీ, కొత్తగూడెం బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తొండపు నరేష్,జంట గ్రామాల గ్రామస్తులు కర్రీ శ్రీను,అప్పినబోయిన వెంకన్న, షేక్. అజారుద్దీన్ పాల్గొన్నారు.