జైలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించడానికి చాలామంది సినిమా ప్రముఖులు అలాగే బంధువులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళా చనిపోయిన సందర్భంగా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చివరి పోరు నేడే!.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి తమ సినిమా షూటింగ్ షెడ్యూల్సును పక్కనపెట్టి అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు ధైర్యం నింపిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో బన్నీ పోలీస్ స్టేషన్లో ఉండగా భద్రతా దృశ్య మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ ను కలవనివ్వలేదు పోలీసులు. ఇక అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి రాగానే విషయమంతా తెలుసుకున్న అల్లు అర్జున్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.
అమెరికాకు కేసీఆర్.. అరెస్ట్ భయంతోనేనా?
కాగా శనివారం ఉదయం విడుదలైన అల్లు అర్జున్ ను చూడడానికి చాలామంది టాలీవుడ్ సినీ ప్రముఖులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. మెగా ఫ్యామిలీతో పాటు కలిసి అల్లు అర్జున్ ఇవ్వాళ అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా చేయనున్నారట. అయితే చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లారు అని డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం సంధ్య థియేటర్ ఘటన గురించి చిరంజీవితో అల్లు అర్జున్ చర్చించడానికి మాత్రమే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారని సమాచారం అందింది. కాగా దాదాపుగా చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. పుష్ప 2 తో బన్నీ దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాడు.