క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోటి రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు నిన్న హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. దీనిపై అల్లు అర్జున్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేసి ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం జడ్జి వీరికి బెయిల్ మంజూరు చేశారు. నిన్న జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ పై ఇంట్లోకి దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడిన ఆరుగురు ఓయూ జేఏసీ నేతల్ని ఇవాళ వనస్దలిపురంలోని జడ్జి ఇంట్లో హాజరుపర్చారు. దీంతో ఆయన మొత్తం ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Read Also : రేవంత్ సినీ ఇండస్ట్రీ పై పగబట్టడం చాలా దారుణం : బండి సంజయ్
పోలీసులు రిమాండ్ రిపోర్టులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా జడ్డి మాత్రం వీరికి బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు నిందితులు తలో 10 వేల చొప్పున చెల్లించడంతో పాటు రెండేసి ష్యూరిటీలు ఇచ్చి బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు నిన్నటి దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి ఇవాళ భద్రత పెంచారు. నిన్న దాడి తర్వాత బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఇవాళ దాన్ని మరింత పెంచారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగిన వారికి ఇవాళ బెయిల్ లభించిన నేపథ్యంలో వారి కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టబోతున్నారు. మరోవైపు నిన్న దాడి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఘటనను ఖండించి పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :