పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తెలంగాణలోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్ళగా, అక్కడ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే చనిపోయిన మహిళ కుమారుడు శ్రీ తేజ్ అదే తొక్కిసలాటలో గాయపడగ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను బాధ్యులుగా చేస్తూ A11 గా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వెంటనే తిరిగి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు కూడా రావడం జరిగింది.
Read More : శబరిమలలో తెలుగు స్వాములపై వివక్ష!
తొలిసారిగా గాయపడిన శ్రీ తేజను పరామర్శించడానికి అల్లు అర్జున్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నాడు. దాదాపుగా 25 నిమిషాల పాటు హాస్పటల్లో ఉండి గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొద్ది నిమిషాల పాటు శ్రీ తేజను పరామర్శించడం జరిగింది. కాగా బాలుడి చికిత్సకు కావాల్సినటువంటి ఖర్చునంత మా చిత్ర బృందమే భరిస్తుందని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
Read More : భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
అయితే ఇవాళ అల్లు అర్జున్ తో పాటుగా నిర్మాత దిల్ రాజ్, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ కూడా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వచ్చారు. కాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ ను బాధ్యులుగా చేసి అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసింది. అ బాలుడు ఆసుపత్రిలో చేరిన నెల రోజుల తరువాత అల్లు అర్జున్ ఇవాళ అ బాలుడిని పరామర్శించడానికి వచ్చారు. తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించారు. మరోవైపు దిల్ రాజ్ చనిపోయిన మహిళా భర్తకి సినిమా ఇండస్ట్రీలో మంచి జాబ్ ఇప్పిచ్చి పూర్తిగా బాధ్యత తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
Read More : భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. అన్ని రాష్ట్రాల్లో హై అలెర్ట్