పుష్ప 2 సినిమా విడుదల లో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన కారణంగా అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా అల్లు అర్జున్ చాలా ఫీల్ అవుతున్నాడు అంటూ తన తండ్రి అల్లు అరవింద్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అన్నట్లుగా మాట్లాడారు.
టెస్ట్ ప్రాక్టీస్ లో గాయాలు!… జట్టును వీడనున్న రోహిత్, కేఎల్
అల్లు అర్జున్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ ఒక్క సంఘటనకు చాలా బాధపడుతున్నాడని చెప్పుకొచ్చారు. ఎన్నాళ్ళని ఇలా బాధపడతావని ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో పాటు కలిసి అలా రిలీఫ్ గా తిరిగేసి రా అని ఎంత చెప్పినా కూడా బయటకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కేసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయినట్లుగా అనిపిస్తుందని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
శబరిమలలో లక్షలాది భక్తులు.. చేతులెత్తేసిన ఆలయ అధికారులు
కాగా పుష్ప సినిమా అనేది దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ తో భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటికే దాదాపుగా 1500 కోట్లకు పైగా సినిమా వసూళ్లు అనేవి వచ్చాయి. ఇది ఇలా ఉండగా సీఎం రేవంత్ కూడా అల్లు అర్జున్ ను తిట్టడం వంటి సంఘటనలు మనం ప్రతిరోజు కూడా వింటూనే ఉన్నాం. సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం వల్ల మూవీ యూనిట్ అందరూ కూడా డిప్రెషన్ లోకి వెళ్లారు.
రోడ్ల మీదికి వస్తే తాట తీస్తాం.. హీరోలకు కోమటిరెడ్డి వార్నింగ్