క్రీడలు
Trending

క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు ఆ ప్లేయర్ ను తొలగించాలి అని బీసీసీఐ ఆదేశాలు?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- గత కొద్ది రోజుల నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న దృశ్యాలను మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులలో కొందరు చనిపోగా చాలామంది గాయపడ్డారు. దీంతో మన భారతదేశంలోని హిందువులందరూ కూడా ఈ ఏడాది జరగబోయేటువంటి ఐపిఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకూడదు అని… వారిని కూడా పాకిస్తాన్ దేశం లాగా బహిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి క్రికెటర్ ముస్తాఫిజర్ రెహమాన్ ఒక్కరు మాత్రమే ఐపీఎల్ లో కొనసాగుతున్నారు.

Read also : ఈరోజు బతికున్నాను అంటే దానికి కారణం అంజనేయస్వామీనే : పవన్ కళ్యాణ్

తాజాగా జరిగిన మినీ వేలంలో అతడిని కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ప్లేయర్ ను వెంటనే జట్టు నుంచి రిలీజ్ చేయాలి అని కోల్కత్తా జట్టుకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని నేరుగా బీసీసీఐ బోర్డు సెక్రటరీ దేవజీత్ సైకియా వెల్లడించారు. కేవలం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజరును ఐపీఎల్ లో ఆడించవద్దు అని యావత్ దేశవ్యాప్తంగా డిమాండ్లు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మన దేశ క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో భారత అభిమానులు అనుకున్నట్లుగానే జరగడంతో క్రికెట్ అభిమానులు అందరూ కూడా బీసీసీఐ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read also : ఈ ఏడాది వరల్డ్ కప్ మ్యాచ్ ల తో ఫ్యాన్స్ కు పండుగే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button