
టాలీవుడ్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ తన మనసులో ఉన్నటువంటి కోరికను తాజాగా బయటకు వెల్లడించాడు. పెద్ద స్టార్లతో కలిసి సినిమాలు చేయాలనే కోరికను మీడియా వేదికగా తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉందని అల్లరి నరేష్ అన్నారు.
పోలీసులకు గన్ అప్పగించిన మోహన్ బాబు?
అయితే తాజాగా ‘బచ్చల మల్లి’ అనే సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ విషయాలను తను చెప్పుకొచ్చాడు. ఇక బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే ఈ మధ్యనే ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నాది సీరియస్ క్యారెక్టర్ అని అన్ని విధాల ఎమోషన్స్ ఉంటాయని అన్నారు. కాబట్టి ఎప్పుడూ కామెడీ క్యారెక్టర్స్ చేసే నేను ఇలాంటి సినిమాలు ఈమధ్య చేస్తూ వస్తున్నాను. ఈ సినిమా స్టోరీ నచ్చే ఈ సినిమాని ఒప్పుకొని మరి నటించానని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే సంవత్సరం మరో రెండు కామెడీ చిత్రాలతో మీ ముందుకు వస్తానని అన్నారు.
రేపు మరో వాయుగుండం!… ఏపీలో నాన్ స్టాప్ వర్షాలే?
తన పాత్ర బాగుంటే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి అయినా ఇప్పుడు కూడా నేను సిద్ధంగానే ఉంటానని అల్లరి నరేష్ అన్నారు. గమ్యం మరియు మహర్షి వంటి చిత్రాల్లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించి మంచి హిట్స్ సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అతను కామెడీ సినిమాలను పక్కనపెట్టి సీరియస్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి సినిమాలను ఎంచుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి ఉండాల్సిందే.