ఆంధ్ర ప్రదేశ్

ALERT: ఇంటర్ పరీక్షల టైమ్‌ టేబుల్‌లో మార్పు

ALERT: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది.

ALERT: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది. 2026 సంవత్సరానికి సంబంధించి ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌కు 2026 సంవత్సరపు అధికారిక సెలవుల జాబితాను అనుసంధానం చేస్తూ ఈ మార్పులు చేసినట్లు బోర్డు తెలిపింది.

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 24వ తేదీతో ముగియనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 23న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, ఫిబ్రవరి 24 నుంచి రెండో సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి. సంప్రదాయంగా మొదట భాషా పేపర్లు నిర్వహించనుండగా, ఆ తర్వాత ప్రధాన సబ్జెక్ట్ పేపర్లు జరగనున్నాయి.

ఇంటర్మీడియట్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నెలలో కూడా కొన్ని ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహించనుండగా, జనవరి 23న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది. ఇవి తప్పనిసరి అర్హత పరీక్షలుగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. అన్ని ప్రాక్టికల్ పరీక్షలను నిబంధనల ప్రకారం, పర్యవేక్షణతో నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది.

అక్టోబర్ నెలలో ప్రకటించిన పాత షెడ్యూల్‌తో పోలిస్తే రెండు ప్రధాన మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాజిక్–1 పరీక్షను మార్చి 20కు బదులుగా మార్చి 21న నిర్వహించనున్నారు. అలాగే రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2ఏ లేదా సివిక్స్ 2 పేపర్ పరీక్షను మార్చి 3 నుంచి మార్చి 4వ తేదీకి మార్చారు. మిగతా అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

విద్యార్థులు ఈ సవరించిన టైమ్ టేబుల్‌ను గమనించి, తమ చదువు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల సమయంలో హాల్ టికెట్, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ 2026- ముఖ్య తేదీలు

ఫిబ్రవరి 23 – మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 24 – రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 25 – మొదటి సంవత్సరం ఇంగ్లీష్
ఫిబ్రవరి 26 – రెండో సంవత్సరం ఇంగ్లీష్
ఫిబ్రవరి 27 – మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1
ఫిబ్రవరి 28 – రెండో సంవత్సరం హిస్టరీ లేదా బోటనీ పేపర్ 2

మార్చి 2 – మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 1, 1ఏ
మార్చి 4 – రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2ఏ లేదా సివిక్స్ 2
మార్చి 5 – మొదటి సంవత్సరం బయాలజీ లేదా మ్యాథ్స్ 1బి, జూవాలజీ 1
మార్చి 6 – రెండో సంవత్సరం జూవాలజీ 2 లేదా ఎకనామిక్స్ 2
మార్చి 7 – మొదటి సంవత్సరం ఎకనామిక్స్ 1
మార్చి 9 – రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2బి
మార్చి 10 – మొదటి సంవత్సరం ఫిజిక్స్ 1
మార్చి 11 – రెండో సంవత్సరం ఫిజిక్స్, కామర్స్, సోషియాలజీ, మ్యూజిక్ 2

మార్చి 12 – మొదటి సంవత్సరం కామర్స్, సోషియాలజీ, మ్యూజిక్ 1
మార్చి 13 – రెండో సంవత్సరం ఫిజిక్స్ 2
మార్చి 14 – మొదటి సంవత్సరం సివిక్స్ 1
మార్చి 16 – రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ లేదా జియోగ్రఫీ 2
మార్చి 17 – మొదటి సంవత్సరం కెమిస్ట్రీ 1
మార్చి 18 – రెండో సంవత్సరం కెమిస్ట్రీ 2
మార్చి 21 – మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాజిక్ 1
మార్చి 23 – రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాజిక్ 2
మార్చి 24 – మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ లేదా జియోగ్రఫీ 1

ALSO READ: లవర్ కోసం మతం మారిన యువకుడు.. చివరికి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button