
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందినటువంటి అఖండ-2 చిత్రం కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అని సినీవర్గాలు తెలిపాయి. ఇక ఈ నిర్ణయం పై ఎటువంటి అనుమానాలు అలాగే మార్పులు ఉండబోవు అని స్పష్టం చేశారు. కానీ ఈ తేదీని అధికారికంగా మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. ఈ సినిమా తొలతా నిన్న డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల ద్వారా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నిర్ణయించిన తేదీకి విడుదల కాకపోవడం పై బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. అలాగే డబ్బులు విషయంలో కొన్ని అడ్డంకులు రావడంతో బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను తమ రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో డిసెంబర్ 25వ తేదీనైనా కచ్చితంగా విడుదల చేయాల్సిందే అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు ఈ తేదీని ప్రకటిస్తుందో వేచి చూడాలి.
Read also : గిరిజన ప్రాంతాలలో సినిమాలు, సీరియల్ షూటింగ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి : పవన్ కళ్యాణ్
Read also : కృష్ణ కృష్ణ… ఏందయ్యా ఈ బౌలింగ్!





