
Ajit Doval Russia Visit: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే నెపంతో భారత్ మీద టారిఫ్ ల హెచ్చరికలను తీవ్రతరం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత్ కీలక స్టెప్స్ తీసుకుంటుంది. తమ దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తేల్చి చెప్పింది. రష్యా ఆయిల్ కొనుగోలు చెయ్యొద్దంటున్న అమెరికా, అక్కడి నుంచి తమ దేశానికి దిగుమతులు ఎలా చేసుకుంటుందని ప్రయత్నించింది.
రష్యా పర్యటనకు అజిత్ దోవల్
అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. భారత్- రష్యా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. రష్యా చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారంతో పాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దోవల్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరులో జైశంకర్ రష్యా పర్యటన
అటు ఈ నెల చివరలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ తో ఆయన సమావేశం కానున్నారు.
Read Also: భారత్‌ను దూరం చేసుకోవద్దు.. నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు!