అంతర్జాతీయం

ఎయిర్‌లెస్ vs ట్యూబ్‌లెస్ టైర్స్.. ఏది మంచిదంటే?

నేటి కాలంలో సాంకేతికత ప్రతి రంగంలో వేగంగా మార్పులు తీసుకువస్తోంది. మొబైల్, కంప్యూటర్, మెడికల్ రంగం మాత్రమే కాదు..

నేటి కాలంలో సాంకేతికత ప్రతి రంగంలో వేగంగా మార్పులు తీసుకువస్తోంది. మొబైల్, కంప్యూటర్, మెడికల్ రంగం మాత్రమే కాదు.. ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని దశాబ్దాల క్రితంవరకు ట్యూబ్ టైర్లే ఉన్నప్పటికీ, ఆ తరవాత ట్యూబ్‌లెస్ టైర్లు ప్రాముఖ్యత సాధించాయి. ఇప్పుడు వాటి తర్వాతి దశగా పూర్తిగా కొత్త సాంకేతికత ఆధారంగా రూపొందుతున్న ఎయిర్‌లెస్ టైర్లు వాహన ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్నాయి. గాలి నింపాల్సిన అవసరం లేకుండా పనిచేయడం, పంక్చర్ అనే సమస్యను పూర్తిగా తొలగించడం వంటి లక్షణాలతో ఇవి రాబోయే కాలంలో సాధారణ వాడుకలోకి రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్‌లెస్ టైర్లు అంటే ఏమిటి?

ఎయిర్‌లెస్ టైర్లు అనేవి పేరులో సూచించినట్లుగా గాలి లేకుండా పనిచేసే టైర్లు. గాలి లేకున్నా బలంగా, స్థిరంగా, సమతూకంగా వాహనాన్ని నడిపేలా ప్రత్యేక రబ్బరు నిర్మాణంతో, బలమైన సింథటిక్ స్పోక్స్‌తో, అధునాతన బెల్ట్ లేయర్లతో రూపొందిస్తారు.

ఎయిర్‌లెస్ టైర్ల నిర్మాణం

మధ్యలో ఖాళీ ఉండే ప్రత్యేక ఫ్లెక్సిబుల్ రబ్బరు స్పోక్స్

బలమైన బెల్ట్ స్ట్రక్చర్

బయట భాగంలో హై డ్యూరబుల్ రబ్బరు

టైర్‌లో గాలి లేకపోవడం వల్ల చీలికలు, మేకులు, గాజు ముక్కలు, పదునైన రాళ్లు వంటి వాటి ప్రభావం ఉండదు. అందుకే పంక్చర్ అనే సమస్య పూర్తిగా శూన్యం. చూసేందుకు కూడా కొత్త తరహా ఫ్యూచరిస్టిక్ లుక్ కలిగి ఉండటం వీటి మరో ప్రత్యేకత.

ఎయిర్‌లెస్ టైర్ల జీవితకాలం ఎంత?

ఎయిర్‌లెస్ టైర్లు సాధారణ టైర్లతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్యూబ్‌లెస్ టైర్లు సాధారణ రహదారులపై సగటున 50,000 నుంచి 70,000 కిలోమీటర్లు పనిచేస్తాయి. కానీ ఎయిర్‌లెస్ టైర్లు కొత్త తరహా పదార్థాలతో తయారు చేయబడినందున 80,000 నుంచి 1,00,000 కిలోమీటర్లు వరకు సులభంగా పనిచేస్తాయి.

ఎందుకు ఎక్కువగా పనిచేస్తాయంటే?

గాలి ఒత్తిడి మార్పుల ప్రభావం లేకపోవడం

పంక్చర్, లీకేజీ, బ్లోఅవుట్ వంటి సమస్యలేని డిజైన్

లోపలి పదార్థం సింథటిక్ ఫైబర్, హై గ్రేడ్ రబ్బరు

డిఫార్మేషన్ సమస్యలు తక్కువ

అయితే వాహనం వాడకం, రోడ్డు పరిస్థితులు, డ్రైవింగ్ శైలి వంటి అంశాలు జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయి.

ట్యూబ్‌లెస్ టైర్లకంటే ఎయిర్‌లెస్ టైర్లు ఎలా మెరుగ్గా ఉంటాయి?

ట్యూబ్‌లెస్ టైర్లు ట్యూబ్ లేకుండా రిమ్‌తో గాలి ముద్ర ఏర్పడే విధంగా పనిచేస్తాయి. ఇవి పంక్చర్ అయినా గాలి నెమ్మదిగా బయటకు వచ్చి డ్రైవర్‌కు నియంత్రణ కోల్పోకుండా సహాయపడతాయి. అందుకే ఇవి సాధారణంగా కార్లలో విస్తృతంగా వాడుతున్నారు.

ఎయిర్‌లెస్ టైర్ల ప్రయోజనాలు

గాలి లేకపోవడంతో పంక్చర్ అనే సమస్యే లేదు

పేలిపోవడం లేదా బ్లోఅవుట్‌కు అవకాశం లేదు

నిర్వహణ ఖర్చు చాలా తక్కువ

ఎక్కువ మన్నిక

రీసైక్లింగ్ సులభం కావడంతో పర్యావరణానికి హితం

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా అనుకూలం

ALSO READ: I BOMMA నిర్వాహకుడు అరెస్ట్.. మూడు కోట్లు స్వాధీనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button