Homeఆంధ్ర ప్రదేశ్జగన్, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఐలయ్య!.

జగన్, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఐలయ్య!.

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రముఖ రాజకీయ మరియు సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరియు జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో 2024 ఎలక్షన్ల టైం లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ క్షీణించిందని భావించారు. అందుకే గతంలో మోదీపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు నాయుడు ఎన్నికలలో మాత్రం పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఆలోచించి పొత్తు పెట్టుకుని గెలిచారు. గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని కూడా పొందారు. కేవలం చంద్రబాబు నాయుడుని ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అరెస్టు చేయడమే తన విజయానికి మరింత బలం చేకూరిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటినుండి చంద్రబాబు నాయుడు పై ప్రజల్లో సానుభూతి కలిగింది. దీంతో అత్యధికంగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు.

జగన్ మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది..?

ఈ నేపథ్యంలోనే కంచ ఐలయ్య జగన్ మరియు పవన్ కళ్యాణ్ ల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటిగా జగన్మోహన్ రెడ్డి సరైన ప్రణాళిక పద్ధతిలో భాగంగా నడుచుకోవాలని సూచించారు. జగన్ ఒంటరిగా పోటీ చేయాలనే వైఖరిని మార్చుకోవాలని అన్నారు. జాతీయస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర పెరగాలంటే రాజకీయంగా అన్ని పార్టీలతో కూడా కలియకల అవసరమని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఐలయ్య సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను భవిష్యత్తులో బిజెపిలో విలీనం చేసుకొని.. మహారాష్ట్ర తరహాలో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వివాహము అమలు చేసే అవకాశం ఉందని అన్నారు. మొత్తం మీద ప్రాంతీయ పార్టీల ఉనికిని తగ్గించాలని బిజెపి వ్యూహం… ఈ పది ఏళ్ల రాజకీయ మార్పుల కేంద్రబిందువై మారుతుందని ఐలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఏం చెప్పబోతున్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఎన్ని రోజులంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments