ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌… మూడురోజుల పాటు వానలే వానలు

  • భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్‌

  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

  • ఉమ్మడి కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాలకు హెచ్చరికలు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సుందని ప్రకటించింది. అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వీటితో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుండటంతో ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది వాతావరణ కేంద్రం.

శ్రీశైలంలో ఒక గేటు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం మరోసారి పూర్తిస్థాయికి నీటిమట్టానికి చేరుకోవడంతో ఒక గేటు ఎత్తారు అధికారులు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1.10లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరద వచ్చినట్లు 1.14లక్షల క్యూసెక్కుల వరదను దిగవన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటరీకి 20వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌కేంద్రం ద్వారా 35వేల క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 32వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.90 అడుగులుగా రికార్డయింది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు అలర్టయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 20,748 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 25 గేట్లు ఎత్తి 18,125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాల్వలకు 2,623 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Read Also: 

  1. శ్రీశైలంలో మళ్లీ మోగిన ‘సైరన్’… ఏ క్షణమైనా గేట్లు ఎత్తొచ్చు?
  2. తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల
Back to top button