జాతీయం

బ్లాక్ బాక్స్ దొరికింది.. ప్రమాదానికి కారణం తేలిపోనుంది!

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఏ కారణంతో విమానం కూలిపోయింది అనే విషయంలో ఇప్పటి వరకు కచ్చితమైన కారణం తెలియదు. కొంత మంది పక్షులు ఢీకొన్నాయి అంటే, మరికొంత మంది సాంకేతిక సమస్య అంటున్నారు. అయితే, విమాన ప్రమాదానికి అసలు కారణం చెప్పే, బ్లాక్ బాక్స్ లభించింది. ఈ బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించనుంది.

ఇంతకీ ఏంటీ బ్లాక్ బాక్స్?

విమానంలోని కాక్ పిట్ లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆరెంజ్, బ్లాక్ కలర్ లో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. విమాన ప్రమాదాలకు సంబంధించిన కీలక విషయాలు ఇందులో రికార్డు అవుతాయి. విమానం ప్రారంభమైన దగ్గరి నుంచి ప్రమాదం జరిగిన సమయం వరకు ఏం జరిగింది? అనే విషయం ఇందులో నిక్షిప్తం అవుఆయి. బ్లాక్ బాక్స్ విచారణ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలోనూ అందరూ బ్లాక్ బాక్స్ గురించి ఆరా తీశారు. దీని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మెడికల్ కాలేజీ హాస్టల్ శిథిలాల్లో దొరికింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ ను గుర్తించారు. ఈ విమానంలో రెండు బ్లాక్ బాక్స్ లు ఉండగా, ఒకటి డిజిటల్ వీడియో రికార్డర్ బాక్స్ దొరికిందని డీజీసీఏ వెల్లడించింది.

బ్లాక్ బాక్స్ ఆధారంగా విచారణ

బ్లాక్ బాక్స్ దొరికిన నేపథ్యంలో దీనిలో రికార్డు అయిన సంభాషణలను అధికారులు పూర్తి విశ్లేషించనున్నారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే క్రాష్ కావడం వెనుక ఉన్న గుట్టురట్టు కానుంది. నిజానికి బ్లాక్ బాక్స్ లు ఎలాంటి ప్రమాదం జరిగినా చెక్కు చెదరకుండా ఉంటాయి. ప్రమాదానికి గల పూర్తి సమాచారం ఇందులో రికార్డు అవుతుంది. ప్రతి విమానంలో రెండింటిని ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కాగా, మరొకటి ఫ్లైట్ డేటా రికార్డర్. విమాన ప్రమాదం ఎక్కడ జరిగాన, దానికి సంబంధించిన కారణాలను ఈ బ్లాక్ బాక్సులు రికార్డు చేస్తాయి. సుమారు 25 గంటల పాటు జరిగిన సంభాషణలు ఇందులో రికార్డు అవుతాయి. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా విమానంలో ఏం జరిగింది? ప్రమాదానికి కారణం ఏంటి? అనే విషయాలు వెలుగులోకి వస్తాయి.

Read Also: మృతదేహాల గుర్తింపులో జాప్యం, కన్నీటితో బంధువుల ఎదురు చూపులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button