
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి “జననాయగన్” జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆరోజు కొన్ని అనివార్య కారణాల వలన సినిమా విడుదలకు కొంచెం సమయం పడుతుంది అని సినీ వర్గాలు ప్రకటించిన తాజాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ జననాయగన్ సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదు అనే విషయాన్ని తెలిపారు. జననాయగన్ సినిమా ఎందుకు విడుదల కాలేదో ప్రతి ఒక్కరికి తెలుసు అని విజయ్ తండ్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు అని చంద్రశేఖర్ తీవ్రంగా ఆరోపించారు. నా తనయుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే తమిళనాడును 60 ఏళ్లుగా శాసిస్తున్నటువంటి ద్రవిడియన్ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా పరిస్థితి మారింది అని అన్నారు. అందుమూలంగానే విజయ్ సినిమాను రాజకీయ కారణాలతోనే విడుదల ఇంకా ఆలస్యం అవుతుంది అని చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తానికి జననాయగన్ సినిమా విడుదలపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతానికైతే ఎటువంటి క్లారిటీ లేదు. విజయ్ విస్తృత స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విడుదలబోతున్న మొట్టమొదటి సినిమాకు మొదట్లోనే అడ్డంకులు ఎదురయ్యాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కట్లేదు.
Read also : మహాత్మా గాంధీ 78వ వర్ధంతి..దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు
Read also : Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక!





