జాతీయం

ఆ మార్గాలన్నీ నో ప్లైయింగ్ జోన్ లోకి.. అమర్ నాథ్ యాత్రకు భద్రత్త కట్టుదిట్టం!

Amarnath Yatra 2025: త్వరలో అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం.. భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే అమర్ నాథ్ యాత్రకు వెళ్లే అన్ని దారులను న్లో ప్లయింగ్ జోన్ లోకి తీసుకొస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిహ్హ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

జులై 1 నుంచి ఆగష్టు 10 వరకు ఆంక్షలు అమలు

అమర్ నాథ్ యాత్ర కోసం భక్తులు పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా వెళ్తుంటారు. ఈ మార్గాలను నో ప్లైయింగ్ జోన్ గా అనౌన్స్ చేశారు. జూలై 1 నంచి ఆగస్టు 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సుమారు 38 రోజుల పాటు ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది. జులై 3న ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగష్టు 8తో ముగుస్తుంది.

డ్రోన్లు, బెలూన్లు కూడా ఎగురవేయకూడదు!

అమర్ నాథ్ యాత్ర కోసం నో ఫ్లయింగ్ జోన్లు ప్రకటించిన మార్గాల్లో ఎలాంటి ఎగిరే వస్తువులను అపరేట్ చేయకూడదని అధికారులు సూచించారు. యూఏవీలు, డ్రోన్లు, బెలూన్లపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్య సామాగ్రి తరలింపు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘా లాంటి విషయాన్ని మినహాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈసారి అమర్‌ నాథ్ యాత్ర కోసం 581 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలిసారి అమర్‌ నాథ్ యాత్రకు ఎస్కార్ట్‌ గా ఉండే సీఏపీఎఫ్ కాన్వాయ్‌ పరిరక్షణ కోసం జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

Read Also: రఘువంశీపై మంత్ర ప్రయోగం, హనీమూన్ మర్డర్ కేసులో న్యూ ట్విస్ట్!

Back to top button