
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోని ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మిగతా కొన్ని జిల్లాలలో పొడి వాతావరణం మరికొన్ని జిల్లాలలో వేడి వాతావరణం ఉంటుందని తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 మండలాల్లో తీవ్ర వడ గాలులు వీస్తాయని పేర్కొంది.
అప్పుడు కావాలి జగన్… ఇప్పుడు మారాలి జగన్ – వైసీపీ భవిష్యత్ కోసమేనా…!
కాగా మరోవైపు ఉపరితల ద్రోని వల్ల నిన్న తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడిన విషయం మనందరికీ తెలిసిందే. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి చల్లదనం కనిపించింది. కాబట్టి చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నిన్న, మొన్నటి వరకు తీవ్రంగా వేడి గాలులు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోని ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో వర్షాలు పడుతుండడంతో ప్రజలకు వేడి నుండి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటివరకు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఉండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భూగర్భ జలంలో నీరు లేక, పైరు ఎక్కడ ఎండిపోతుందో అని చాలామంది ప్రజలు భయపడిపోయారు.
ఎన్నికల తర్వాత కనిపించని కన్నా – టీడీపీపై అసంతృప్తే కారణమా..!