మునుగోడు,క్రైమ్ మిర్రర్:- రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఐఏఎస్ ఆదేశాల మేరకు 21-02-2026న రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు మరియు సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌లను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సాంకేతిక విద్య యొక్క ప్రాముఖ్యత, పాలీసెట్ ద్వారా ప్రవేశాలు, మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్ సి.హెచ్. నరసింహ రావు ఆదేశాల ప్రకారం నల్గొండ జిల్లాలోని పలు హైస్కూల్‌లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీసాల సైదులు, (హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి), సీనియర్ లెక్చరర్ పిట్టలా నరసింహ, లెక్చరర్లు డా.నకిరేకంటి సైదులు, మరియు ఆనంద్ కుమార్ కలిసి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశమై సాంకేతిక విద్యపై సమగ్ర వివరాలు అందించారు.నల్గొండ జిల్లాలో
పలివెల హైస్కూల్,ఎస్ఎస్ఆర్ హైస్కూల్, మునుగోడు
ప్రభుత్వ హైస్కూల్, బోడంగిపర్తి హైస్కూల్, చండూర్ హైస్కూల్ తోపాటు తెలంగాణ రెసిడెన్షియల్ హైస్కూల్, సర్వేలు లను సందర్శించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ వసతి ఉండాలని, పాలీసెట్ ఫీజు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు హాస్టల్ వసతి అంశాన్ని ప్రస్తావించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి SC,ST విద్యార్థులకు పాలీసెట్ ఉచితంగా అందించేందుకు మా సంఘం తరఫున ప్రతిపాదనలు చేయనున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మునుగోడు పూర్వ విద్యార్థులు అయిన పిట్టల నరసింహ (1988 బ్యాచ్), నకేరేకంటి సైదులు (2004 SSC బ్యాచ్)లను మునుగోడు ఉపాధ్యాయులు మరియు ఎస్ఎస్ఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శాలువాతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా శిలార్మీయగూడెం గ్రామానికి చెందిన, తిప్పర్తి హైస్కూల్ (1984–85 బ్యాచ్) పూర్వ విద్యార్థి అయిన మీసాల సైదులును ,మిత్రుడు అయిన కెమిస్ట్రీ ఉపాధ్యాయులు చంద్రం మునుగోడులో శాలువాతో సత్కరించారు.
వారు పాఠశాలకు తిరిగి వచ్చి సాంకేతిక విద్యపై అవగాహన కల్పించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా వారు చదివిన రోజుల్ని, అప్పటి అనుభవాలను విద్యార్థులతో పంచుకుని, కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమని, సాంకేతిక విద్య ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వారికి ప్రోత్సాహం ఇచ్చారు. తమ పాఠశాలలో మళ్లీ అడుగుపెట్టి విద్యార్థులతో మాట్లాడటం వారి జీవితంలో గర్వకారణమైన, మరపురాని క్షణంగా నిలిచినదనీ పేర్కొన్నారు.

