
కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపంతో ఓ యువ జంట ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. రామ్‌దర్బార్–హల్లోమాజ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియ (19), ఉత్తరాఖండ్‌కు చెందిన మనీష్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని భావించిన ఈ జంటకు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, యువ జంట మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ పూర్తయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: జగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 45 రోజుల పసికందు మృతి!