Wednesday, February 25, 2026
HomeUncategorizedసీఎం రేవంత్ రెడ్డితో అడోబ్ సీఈవో భేటి

సీఎం రేవంత్ రెడ్డితో అడోబ్ సీఈవో భేటి

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం రేవంత్ రెడ్డితో అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ భేటి అయ్యారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం సీఎం నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా గ్లోబ‌ల్ మాన్యుఫాక్చ‌రింగ్‌, గ్రీన్ ఎన‌ర్జీ, ఏఐ ప్ర‌భావంపై చ‌ర్చించారు. మాన్యుఫాక్చరింగ్ రంగంలో తెలంగాణను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు, ప్రముఖ సంస్థలను ఆకర్షించడానికి సరైన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

రాబోయే రోజుల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై శంతను నారాయణ్ తో ముఖ్యమంత్రి చర్చించారు. సాంకేతిక రంగంతో పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments