Saturday, March 28, 2026
Homeజాతీయంబీజేపీలోకి నటి మీనా.. తమిళనాడుపై పట్టుబిగించేనా?

బీజేపీలోకి నటి మీనా.. తమిళనాడుపై పట్టుబిగించేనా?

Actress Meena-BJP: సౌత్ మీద ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అందులో భాగంగానే ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఖుష్బూ లాంటి సినీ నటులను పార్టీలోకి తీసుకోగా, ఇప్పుడు మరో సీనియర్ నటిని మీనాను బీజేపీ జాయిన్ చేసుకోవాలనిపిస్తోంది. ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, వచ్చే ఏడాది జరిగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. చిన్నా చితకా పార్టీలను ఎన్టీఏ కూటమిలోకి రప్పించడంతో పాటు ప్రజాదరణ ఉన్న ప్రముఖులను కూడా చేర్చుకుంటుంది.

మీనాకు కీలక పదవి!

అటు తమిళనాడులో గుర్తింపు ఉన్న సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఖుష్బూ, నమిత, శరత్ కుమార్-రాధిక దంపతులను పార్టీలోకి జాయిన్ చేసుకుంది. తాజాగా మీనాను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుంచుకోనున్నట్లు తెలిసింది. ఆమె పార్టీలో చేరగానే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ఖుష్బూకు కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇప్పుడు మీనాకు కూడా రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మీనా పదవికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.

Read Also: అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

Most Popular

Recent Comments