క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను నటుడు సోనుసూద్ కలిశారు. రాష్ట్రంలోని సామాన్యుల కోసం తన ఫౌండేషన్ ఎప్పుడూ కూడా పనిచేస్తుందని తెలిపారు. మీరు ఓకే అంటే ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికైనా నేను సిద్ధమని సోను సూద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా నాలుగు కొత్త అంబులెన్స్లను ఇచ్చారు. మరోవైపు సోను సూద్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని, అతను తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన నాలుగు అంబులెన్సులు పట్ల గర్వంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సోను సూదు కు ధన్యవాదాలు తెలిపారు.
కబాలి నిర్మాత ఆత్మహత్య!.. డ్రగ్స్ కేసే కారణముంటున్న బంధువులు?
కాగా సోనుసూద్ అందించిన నాలుగు అంబులెన్స్ల ద్వారా రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలో వైద్య సేవలు అందించడానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. సోను సూద్ నన్ను కలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని మరోసారి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే కోవిడ్ సమయంలోనూ సోనూసూద్ చేసిన సహాయక చర్యలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాలలో గర్వంగా అతని పేరును చెప్పుకునేలా చేశాయి. చాలామంది ప్రజలకు సోనూసూద్ చేసిన సహాయం సోషల్ మీడియాలోనూ వైరల్ అయిన విషయాలు అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజజీవితంలో సోను సూద్ హీరో అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అతను విలన్ రోల్ లో చాలా సినిమాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే.