
Accident: మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. శివసేన అభ్యర్థిని తీసుకుని వెళ్తున్న కారును నడుపుతున్న డ్రైవర్ లక్ష్మణ్ షిండే ఆకస్మికంగా గుండెపోటుకు గురవడంతో వాహనం పూర్తిగా అదుపు తప్పింది. డ్రైవర్‌కు ఏమి జరుగుతోందో అర్థమయ్యేలోపే కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటిపోగా, ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీ కొట్టింది. డ్రైవర్ కాలు యాక్సిలరేటర్‌పై ఇరుక్కోవడంతో వాహనం వేగం మరింత పెరిగి ప్రమాదం తీవ్రత దారుణ స్థాయికి చేరినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 21 సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో డ్రైవర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
A painful road accident in Thane's ambernath area where a car hit multiple two wheelers, 4 killed including car driver, other 4 severely injured#ambernath #Roadaccident #Thane #news pic.twitter.com/EjH1JGCxQq
— Nilesh shukla (@Nilesh_isme) November 21, 2025
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ధ్వంసమైన కారును రోడ్డు పక్కకు తరలించారు. డిసెంబర్ 2న జరగనున్న అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు శివసేన అభ్యర్థి కిరణ్ చౌబే తన డ్రైవర్‌తో కలిసి బువా పాడా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వచ్చిన గుండెపోటు ఎలా ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కారును ఢీకొట్టిన ప్రభావంతో పలువురు వాహనదారులు, ప్రయాణికులు వంతెనపై నుంచి కిందపడటం వలన ప్రమాదం మరింత విషాదకరంగా మారింది.
ఈ ప్రమాదంలో మృతులను డ్రైవర్ లక్ష్మణ్ షిండే, చంద్రకాంత్ అనార్కే (57), శైలేష్ జాదవ్ (45), అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగి సుమిత్ చెలాని (17)గా గుర్తించారు. బైక్ పై ప్రయాణిస్తున్న శైలేష్ జాదవ్‌తో పాటు అనార్కే వంతెనపై నుంచి కిందపడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క డ్రైవర్ గుండెపోటుతో ప్రారంభమైన ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచేసింది.
ALSO READ: Fuel Price: పెట్రోల్ ధరలు పెరుగుతాయా?





