
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియా T20 ఫార్మాట్ లో అద్భుతమైన ప్రదర్శన కనుపరిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం టీం ఇండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ గిల్ ఇద్దరు కూడా తాజాగా జరిగిన మ్యాచ్లలో మంచి ప్రదర్శన కనపరచలేకపోతున్నారు. ఈ సందర్భంలోనే ప్రస్తుతం టి20 లలో అదరగొడుతున్నటువంటి యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ వారిద్దరికీ మద్దతుగా నిలిచారు. సూర్య కుమార్ యాదవ్ అలాగే గిల్ ప్రతిభ నాకు తెలుసు అంటూ.. రానున్న టీ20 మ్యాచ్ లను వారే గెలిపిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వారిద్దరితో కలిసి నేను ఎన్నో మ్యాచులు ఆడాను.. వాళ్ల ప్రతిభ అలాగే ఆట తీరు ఏంటో నాకు బాగా తెలుసు అని… కేవలం కొన్ని మ్యాచ్లలో సరైన ప్రతిభ కనబరచకపోతే వారిపై విమర్శలు చేయడం సరికాదు అని సూర్యకుమార్ యాదవ్ అలాగే గిల్టు మద్దతుగా నిలిచారు అభిషేక్ శర్మ.
Read also : గిల్ పూర్తిగా విఫలం.. జైస్వాల్ రావాల్సిందే..?
ఇక ప్రత్యేకంగా గిల్ గురించి నాకు కెరియర్ ప్రారంభం నుంచి తెలుసు అంటూ.. అతడు టీమ్ ఇండియాకు సరైన ఆటగాడు అని అతనిపై పూర్తిగా నాకు నమ్మకం ఉంది అని తెలిపాడు. త్వరలోనే సూర్య కుమార్ యాదవ్ అలాగే గిల్ ఇద్దరు కూడా బాగా రాణిస్తారు అని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల వరుసగా t20 మ్యాచ్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అలాగే గిల్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అభిషేక్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ 2025 లో సూర్య కుమార్ యాదవ్ అలాగే ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. ఐపీఎల్ లో సూర్య కుమార్ యాదవ్ కు 65.18 సగటుతో ఏకంగా 717 పరుగులు చేశారు. మరోవైపు గిల్ కూడా 50 యావరేజ్ తో 650 పరుగులు చేశారు. కానీ ఇండియా తరఫున మాత్రం ఈ ఇద్దరు ప్లేయర్లు తక్కువ యావరేజ్ తో అతి తక్కువ పరుగులు చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలి అంటూ పలువురు నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read also : ఆకస్మిక మరణాలకు.. కోవిడ్ టీకాలకు ఎటువంటి సంబంధం లేదు : ఢిల్లీ ఎయిమ్స్





