
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులకు నగదు చెల్లింపులు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (Aadhaar Based Payment System) ద్వారా అందించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. అయితే లబ్ధిదారుల వివరాల పరిశీలనలో అధికారులు ఒక కీలక సమస్యను గుర్తించారు. దాదాపు 30 శాతం లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు వారి ఆధార్ రికార్డులతో సరిపోకపోవడం వల్ల నగదు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. ఈ లోపాల కారణంగా లబ్ధిదారులు తమకు రావలసిన మొత్తాన్ని సమయానికి పొందలేకపోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, లబ్ధిదారుల ఆధార్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు అవసరమైన పత్రాలు సమర్పించి ఆధార్ అప్డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాగలదని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి లబ్ధిదారులు నగదు చెల్లింపుల నుండి వంచించబడకుండా చూడాలని ప్రభుత్వ ఆదేశాలను జిల్లా స్థాయి అధికారులకు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి …
-
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ
-
గురుకులంలో తిండి లేక.. కలెక్టర్ కోసం గోడ దూకిన 70 మంది విద్యార్థులు
-
కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ముదిరిన వార్.. RRR కేంద్రంగా సై అంటే సై
-
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. సీఎం రేవంత్ బిగ్ ట్విస్ట్!
-
ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్ అధికారి ‘మణి’హారిక