HomeజాతీయంNew Aadhaar Card: సరికొత్తగా ఆధార్‌ కార్డు, జస్ట్ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉంటాయి!

New Aadhaar Card: సరికొత్తగా ఆధార్‌ కార్డు, జస్ట్ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉంటాయి!

  • మారనున్న ఆధార్ కార్డు స్వరూపం
  • గోప్యత కోసం కేంద్రం కీలక నిర్ణయం
  • ఇక ఆధార్ కార్డుపై ఫొటో, క్యూఆర్‌ కోడ్‌లు మాత్రమే!

ఆధార్ కార్డు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కార్డుదారుల వివరాలను రహస్యంగా ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. ఇకపై కార్డు మీద కేవలం కార్డుదారుడి ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మారనున్న ఆధార్ కార్డు స్వరూపం

ఆధార్‌ కార్డు స్వరూపం మారబోతోంది. ఉడాయ్‌ ఈమేరకు కార్డు డిజైన్‌ను పూర్తిగా మార్చబోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉడాయ్‌ ఆధార్‌ కార్డు డిజైన్‌ను పూర్తిగా మార్చబోతోంది. కార్డుపై కార్డుదారుని ఫొటో, క్యూఆర్‌ కోడ్‌లు మాత్రమే ఉంటాయి. ఆధార్‌ ఆధారంగా జరుగుతున్న నేరాలు… సిమ్‌ కార్డు మోసాలు, అనధికారిక రుణాలు, ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా నగదు తీసుకోవడం వంటి వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉడాయ్‌ ఈమార్పులు తీసుకువస్తున్నట్లు తెలిసింది.

Read Also: రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ ఏం చెప్పారంటే?

అధికారిక ప్రకటన చేయని ఉడాయ్

కొత్త ఆధార్ కార్డులపై ఉడాయ్ ఇప్పటి వరకూ అధికారిక నిర్ధారణ ఏదీ చేయలేదు. అయితే, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఆధార్‌ యాప్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, ఈ విషయం సూచనా ప్రాయంగా అర్థమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌లో సంబంధిత వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది. అంతేతప్ప, మామూలుగా వివరాలు ఏవీ బయటకు కనిపంచవు. వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా కేంద్రం ఈ  ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: కారులో కుక్కతో పార్లమెంట్ కు.. ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్‌ నోటీసు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments