Saturday, March 28, 2026
Homeతెలంగాణరైల్వే ట్రాక్ పైనా యువతి హల్చల్

రైల్వే ట్రాక్ పైనా యువతి హల్చల్

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- నాగుల పల్లి నుండి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతీ హల్ చల్ చేసింది.
నాగులపల్లిలో స్థానికులు గమనించి కారు ను అడ్డుకున్నప్పటికీ పట్టాలపై వేగంగా కారు నడుపుతూ మహిళ హల్చల్ చేసింది.
రైలు పట్టాలపై హల్చల్ చేస్తున్న మహిళను గమనించిన రైలు పైలెట్ ట్రైన్ ను వెంటనే నిలిపివేశాడు.
పట్టాలపై మార్గమధ్యంలో ఆగిపోయిన ఈ రైలు వల్ల
గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే
సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు యువతి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందో కారణం మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు దీనిపై విచారణ చేయనున్నారు.

మందుబాబులకు విజ్ఞప్తి… సేవించే సమయంలో ఈ ఆహారం తప్పనిసరి!..

అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments